రక్షణ లేని దిశ చట్టమా..?

October 15, 2020 at 5:57 pm

ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు దాడులు ఘటనలను పాల్పడి వరకు సత్వరంగా శిక్షలు అమలయ్యేలా చేసేందుకు దిశ చట్టం తీసుకొచ్చింది. అయితే ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అత్యాచారాలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం లో దిశ చట్టం ఎందుకు ఉంది అంటూ ప్రశ్నించారు. ఇటీవలే విజయవాడలో ప్రేమోన్మాది ఏకంగా ఇంజనీరింగ్ విద్యార్థి గొంతు కోసి దారుణంగా హత్య చేయడం… ఇక కొన్ని రోజుల వ్యవధిలోనే అత్యాచార దాడుల ఘటనలు కూడా వెలుగులోకి రావడంపై విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లలకు రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చిన చట్టాలు ప్రస్తుతం ఆడపిల్లలకు రక్షణ కల్పించక పోతే ఇంక చట్టాలు ఎందుకు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టం తీసుకొచ్చింది కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే అంటూ ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు కేసుల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ స్పందిస్తున్న తీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను పటిష్టంగా అమలు చేసినప్పుడే ప్రజలకు చట్టాలపై నమ్మకం కలుగుతుంది అని వ్యాఖ్యానించారు.

రక్షణ లేని దిశ చట్టమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts