క్వారంటైన్‌లోకి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌?

October 3, 2020 at 8:32 am

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో రామ్‌చ‌ర‌ణ్‌, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం లేక పోతే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడ‌క్షన్‌ పనులు జరగాల్సిన ఈ చిత్రం.. లౌక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. షూటింగ్‌ సమయంలో ఉపయోగించే సామాగ్రిని ప్రత్యేకంగా శానిటైజేషన్‌ చేయించటం.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే ఈ నెల 10వ తేదీ నుంచి సినిమా నటులందరూ హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంటారని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క్యారంటైన్‌లోకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. 14 రోజుల క్వారంటైన్ త‌ర్వాత షూటింగ్‌ ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటారని తెలిసింది. కాగా, ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలివియా, అజయ్ దేవగన్‌, శ్రియ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

క్వారంటైన్‌లోకి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts