డాన్స్ షోకు హోస్ట్‌గా చెర్రీ.. ఉపాసన ప్లాన్ అదిరింది?

October 6, 2020 at 8:03 am

మెగా ప‌వ‌ర్ స్టార్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఇప్పటికే 70 శాతం పూర్తైయిన ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్రస్తుతం అందరు హీరోలు షూటింగ్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

విష‌యం ఏంటంటే.. ఆయ‌న ఓ డాన్స్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌. మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే.. మ‌రోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యువర్ లైఫ్ పేరుతో ఒక ఆన్ లైన్ వెబ్ సైట్‌ను స‌మంత‌తో క‌లిసి ఉపాశ‌న‌ మొదలుపెట్టిన సంగ‌తి తెలిసిందే. బాడీ, మైండ్, హీల్, పోషకాహారం ఈ నాలుగిటిపై ప్రజలకు అవగాహన కల్పించడంమే ఈ యువ‌ర్ లైఫ్ యొక్క ముఖ్య ఉద్ధేశం.

అయితే ఇందులోనే దివ్యాంగుల్లో ఉన్న డ్యాన్స్ టాలెంట్ ను ఈ లోకానికి తెలియజేయడానికి `హీల్ యువర్‌ లైఫ్ త్రు డ్యాన్స్` కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ సైతం తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆయనతో పాటే ప్రముఖ కొరియోగ్రఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్ సైతం షోలో పాల్గొంటార‌ని తెలిస్తోంది. ఏదేమైనా దివ్యాంగుల కోసం ఉపాస‌న ప్లాన్ అదిరిపోయింద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

డాన్స్ షోకు హోస్ట్‌గా చెర్రీ.. ఉపాసన ప్లాన్ అదిరింది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts