భీమ్ టీజర్ క్లిప్ పోస్ట్ చేసిన చెర్రీ.. ఎన్టీఆర్ కౌంట‌ర్!

October 21, 2020 at 1:21 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ టీజ‌ర్ రాగా.. ఈ నెల 22న ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట ఎన్టీఆర్‌ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది.

అయితే తాజాగా దానిలోని క్లిప్‌ను విడుదల చేశాడు చెర్రీ. నీళ్లలోంచి కొమురం భీమ్ ఆయుధం తీస్తుండడం ఇందులో క‌నీపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్, చెర్రీల మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర చర్చ జరిగింది. ‘బ్రదర్ తారక్ నీకోసం ఒకటి విడుదల చేస్తున్నాను. కానీ, నీలా కాకుండా సరైన సమయానికి నీ టీజర్ ను విడుదల చేస్తాను’ అని చెర్రీ అన్నాడు.

దీనికి తారక్ కౌంటర్ ఇచ్చాడు. ‘బ్రో.. నువ్వు ఓ విషయాన్ని గుర్తిస్తావని ఆశిస్తున్నాను.. నువ్వు ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యం చేశావు.. ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే ఉండాలి.. ఎందుకంటే జక్కన్నతో వ్యవహారం.. ఏదైనా జరగొచ్చు’ అని ఫ‌న్నీగా కామెంట్ చేశారు. కాగా, 22వ‌ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ టీజ‌ర్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

 

భీమ్ టీజర్ క్లిప్ పోస్ట్ చేసిన చెర్రీ.. ఎన్టీఆర్ కౌంట‌ర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts