కెరీర్‌లోనే తొలి సారి అలా చేస్తున్న ఇస్మార్ట్ రామ్‌!

October 21, 2020 at 9:49 am

ఇస్మార్ట్ శంక‌ర్‌తో ఇటీవ‌ల సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `రెడ్‌`. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం తమిళ మూవీ ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా రూపొందింది.

ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో కూడ విడుదల చేయనున్నారు. అందుకే రామ్ తెలుగుతో పాటు మలయాళంలో కూడ తానే డబ్బింగ్ చెప్పుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే వాస్త‌వానికి వేరే భాషలంటే హీరోలకు డబ్బింగ్ వేరొకరు చెబుతుంటారు. కానీ, రామ్ త‌న కెరీర్‌లోనే తొలి సారి మలయాళంలో డబ్బింగ్ చెప్ప‌బోతున్నాడు.

కాగా, ఇటీవ‌ల రెడ్ చిత్రం ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే భారీ ఆఫర్స్ వచ్చినా.. రామ్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఒప్పుకోలేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని అంటున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

కెరీర్‌లోనే తొలి సారి అలా చేస్తున్న ఇస్మార్ట్ రామ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts