కిడ్నాప్ అయిన వ‌ర్మ‌.. పిచ్చ కామెడీగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్!

October 25, 2020 at 1:15 pm

వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం త‌న‌పైనే `ఆర్జీవి మిస్సింగ్` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.`ఆర్జీవీ మిస్సింగ్` .. పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు వల్లనే అంటూ ఆసక్తికర క్యాప్షన్ తో ఇప్పటికే ఫుల్ ట్రెండ్ అయ్యాడు వర్మ.

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆర్జీవీ కిడ్పాప్‌ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రంగంలో దిగిన పోలీసులు.. విచార‌ణ చేప‌డ‌తారు. ఇందుకు సంబంధించిన సీన్లనే ట్రైలర్ లో చూపిస్తూ కడుపుబ్బా నవ్వించారు.

అలాగే పవన్ కల్యాణ్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, కేసీఆర్‌, కేఏ పాల్, ర‌జ‌నీకాంత్‌, త్రివిక్రమ్ లను పోలిన పాత్రలను కూడా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. మొత్తానికి పిచ్చ కామెడీగా ఉన్న ఈ టీజ‌ర్ ఓ మాదిరిగానే ఆక‌ట్టుకుంటోంది. మ‌రి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కిడ్నాప్ అయిన వ‌ర్మ‌.. పిచ్చ కామెడీగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts