సంక్రాంతి బ‌రిలో `రెడ్‌`.. హిట్ ఖాయ‌మంటున్న రామ్‌!

October 25, 2020 at 10:37 am

ఇస్మార్ట్ శంక‌ర్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం `రెడ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు.

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వాస్త‌వానికి ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌ల‌ రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. దసరా సందర్భంగా ఒక థ్రిల్లింగ్ అప్డేట్ ఇవ్వనున్నామని రెడ్ మేక‌ర్స్ తెలిపిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ అప్‌డేట్ రానే వ‌చ్చింది. తన రెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉంచుతున్నామని తెలిపారు. ఇంతకు ముందు సంక్రాంతికి వచ్చిన దేవదాసు, మస్కా చిత్రాలు ఎలా హిట్టయ్యాయో ఈసారి `రెడ్` తో కూడా హిట్ కొట్టబోతున్నానని రామ్ చాలా నమ్మకంగా అనౌన్స్ చేశారు. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ, సంక్రాంతి రామ్ దిగ‌నున్నాడు.

సంక్రాంతి బ‌రిలో `రెడ్‌`.. హిట్ ఖాయ‌మంటున్న రామ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts