`రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌` వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ అరాచ‌కం సృష్టించాడుగా!

October 22, 2020 at 11:39 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. ద‌ర్శ‌క‌ధీరు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ లుక్‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా.. అద్భుత స్పంద‌న ల‌భించింది.

ఇక ఇప్పుడు అంద‌రూ రాజమౌళి విడుదల చేయనున్న కొమరం భీం టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొమ‌రం భీంగా తారక్ లుక్ ఎలా ఉంటుందా అని నంద‌మూరి అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తుంటే.. మ‌రోవైపు ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేస్తూ చరణ్ గొంతు లోని గాంభీర్యాన్ని వినాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వీరు కోరుకున్న స‌మ‌యం రానే వ‌చ్చింది.

అక్టోబర్ 22(నేడు)న ఉదయం 11 గంటలకు `భీమ్ ఫర్ రామరాజు` రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కాస్త ఆల‌స్యంగా ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఎన్టీఆర్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌లో మాస్ ఎలివేషన్ సీన్స్ మరియు చరణ్ వాయిస్ ఓవర్ అలాగే తారక్ స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజ‌ర్‌ మొత్తం ఎన్టీఆర్ అరాచ‌కం సృష్టించాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్. మ‌రి లేట్ చేయ‌కుండా ఆ టీజ‌ర్‌పై ఓ లుక్కేసేయండి.

 

`రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌` వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ అరాచ‌కం సృష్టించాడుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts