సంక్రాంతికి వ‌స్తానంటున్న రానా!

October 21, 2020 at 2:44 pm

రానా దగ్గుబాటి న‌టించిన తాజా చిత్రం `అర‌ణ్య‌`. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్ పేర్ల‌తో విడుదల కానుంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ చిత్రం పర్యావరణ ఇతివృత్తంతో రూపొందినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుందని, అడవుల గొప్పదనం మనకు ఇప్పటికైనా తెలిసింది.. జాగ్రత్తగా కాపాడుకుందాం.

అడవుల గురించి అవగాహన కలిగించేందుకు అరణ్య వస్తోందని రానా తెలిపాడు. ఈ సందర్భంగా ఓ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో ఒక పగిలిన గోడ, ఏనుగులు, జలపాతం ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే పెరిగిన గ‌డ్డంతో రానా పోస్టర్‌లో క‌నిపిస్తుండ‌గా, విష్ణు విశాల్ తీక్షణ‌మైన చూపుల‌తో క‌నిపిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి బ‌రిలో రానా దిగ‌నున్నాడు.

 

సంక్రాంతికి వ‌స్తానంటున్న రానా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts