ఐపీఎల్ లో యాదృచ్చిక సన్నివేశం.. !

October 29, 2020 at 5:46 pm

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా ఓ అరుదైన ఘనతను సాధించాడు. తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జస్ప్రిత్ బూమ్రా ఓ అరుదైన రికార్డును సాధించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ను అవుట్ చేయగా తాజాగా జస్ప్రిత్ బూమ్రా ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే ఇక్కడ ఓ యాదృచ్చిక సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

బూమ్రా కు ఐపీఎల్ లో తొలి వికెట్, అలాగే 100 వ వికెట్ విరాట్ కోహ్లీ కావడమే. వీటితోపాటు బూమ్రా టి 20 ఫార్మాట్ లో 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్న తొలి భారతీయుడిగా బూమ్రా నిలిచాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మొత్తం 12 మ్యాచ్లు ఆడిన బూమ్రా 20 వికెట్లను తీసుకున్నాడు. ఐపీఎల్ మొత్తంగా 89 మ్యాచ్ లు ఆడిన బూమ్రా ఇప్పటివరకు 102 వికెట్లను తీసుకున్నాడు.

ఐపీఎల్ లో యాదృచ్చిక సన్నివేశం.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts