కీర్తి సురేష్‌కి `రంగ్ దే` టీమ్ సూప‌ర్ గిఫ్ట్‌?

October 17, 2020 at 4:02 pm

మ‌హాన‌టి చిత్రంతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. నేటితో 27 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని.. 28వ‌ వ‌సంతంలోకి అడుగు పెట్టింది కీర్తి. ఈ సంద‌ర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న `రంగ్ దే` నుంచి సూప‌ర్ గిఫ్ట్ వ‌చ్చింది. తాజాగా రంగ్ దే టీమ్ కీర్తి సురేష్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో కీర్తి చిరున‌వ్వు చిందిస్తూ.. అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న ఈ రంగ్ దే చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవ‌ల క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. ఈ చిత్రం 2021 సంక్రాంతి బ‌రిలో దిగ‌నుంది. కాగా, సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, గాయత్రి రఘురామ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

కీర్తి సురేష్‌కి `రంగ్ దే` టీమ్ సూప‌ర్ గిఫ్ట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts