ఆ స్టార్ హీరో కుమార్తెకు అత్యాచార బెదిరింపులు !

October 20, 2020 at 1:01 pm

తమిళ హీరో విజయ్‌ సేతుపతి కుమార్త‌కు కొంద‌రు అత్యాచారం చేస్తామంటూ బెదిరించారు. ఇటీవ‌ల శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌ను ‘800’ పేరిట తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ముత్త‌య్య పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. కానీ, ఈ సినిమా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టి నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.

సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. దీంతో విజ‌య్ సేతుప‌తి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. అయితే ఈ మూవీ నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయనపై ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఆ విమర్శలు హద్దుదాటి ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసే స్దాయికి వెళ్లాయి.

రితిక్ అనే ఓ ట్విట్టర్ యూజర్.. సేతుపతి కుమార్తెను అత్యాచారం చేస్తామంటూ బెదిరింపుల‌కు దిగాడు.రిత్విక్ విజ‌య్ సేతుపతి కుమార్తె అత్యాచారానికి గురైతే తప్ప శ్రీలంకలో తమిళులు పడ్డ బాధ అతడికి తెలీదు అని కామెంట్ పెట్టాడు. దీంతో అత‌డిపై నెటిజ‌న్లు, రాజ‌కీయ నేత‌లు మండిప‌డుతున్నారు. అతడిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆ స్టార్ హీరో కుమార్తెకు అత్యాచార బెదిరింపులు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts