ఆ సినిమాలో నేను నటించడం నమ్మలేకపోతున్నా : రష్మిక ఎమోషినల్‌ ట్వీట్‌

October 27, 2020 at 4:23 pm

టాలీవుడ్ లో రష్మిక మందన్నా గురించి పరిచయం అక్కర్లేదు.అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్‌ రష్మిక. మహేష్ బాబు సరసన నటించి,సరిలేరు నీకెవ్వరు మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో వరుస ఆఫర్స్‌ దక్కించుకుంది. తెలుగు,కన్నడ భాషా చిత్రాల్లో నటించి తన సత్తా చాటిన ఈ అందాల భామ త్వరలోనే తమిళ తెరపై కూడా మెరవనుంది. కార్తీ హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్‌’ లో ఈ ముద్దుగుమ్మ జత కట్టనుంది. ఇది తమిళంలో తనకు మొదటి సినిమా అని సోమవారం విడుదలైన సుల్తాన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ పంచుకుంది రష్మిక.

చిన్నప్పటి నుంచి నాన్న, నేను కలిసి చాలా తమిళ సినిమాలు చూసాం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ చిత్రంలో నేను నటించడం అసలు నమ్మలేకపోతున్నా. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం తనకు దక్కింది అని,ఇందుకు నేను కృతజ్ఞురాలిని అంటూ రష్మిక ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

 

ఆ సినిమాలో నేను నటించడం నమ్మలేకపోతున్నా : రష్మిక ఎమోషినల్‌ ట్వీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts