ర‌ష్మికలో ఈ ట్యాలెంట్‌ కూడా ఉందా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌?

October 15, 2020 at 7:46 am

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్థార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్న ర‌ష్మిక‌.. స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉండే ర‌ష్మిక‌.. తాజాగా త‌న‌లో ఉన్న కొత్త ట్యాలెంట్‌ను బ‌యట పెట్టింది

తాజాగా వంటింట్లో దూరి గరిటె తిప్పింది ర‌ష్మిక‌. త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ఆమ్లెట్‌ను అభిమానుల‌కు చూపించింది. ఈ క్ర‌మంలోనే స్టౌ వెలిగించ‌డం ద‌గ్గ‌ర నుంచి ఆమ్లెట్ వేయ‌డం వ‌ర‌కు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. `చూస్తుంటేనే నోరూరించే విధంగా ఆమ్లెట్‌ను రెడీ చేశారు. నాకు ప్ర‌తిరోజు ఆమ్లెట్ ఉండాల్సిందే. మీరు కూడా దీన్ని ఓసారి ప్ర‌య‌త్నించండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి` అని రాసుకొచ్చారు.

మొత్తానికి ర‌ష్మిక చేసిన ఆమ్లెట్‌కు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా, ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం బన్నీ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. మ‌రియు అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రంలోనూ ర‌ష్మిక న‌టించ‌బోతుంది.

 

ర‌ష్మికలో ఈ ట్యాలెంట్‌ కూడా ఉందా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts