మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టిన ర‌ష్మిక..?

October 24, 2020 at 1:02 pm

ర‌ష్మిక మంద‌న్నా.. `ఛ‌లో` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ఇటీవ‌ల సరిలేరు నీకెవ్వ‌రూ, భీష్మ చిత్రాల‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్లు అందుకున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్న `పుష్ప‌` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

తాజాగా రష్మికకు మరో ఆఫర్ వచ్చినట్టు టాక్ న‌డుస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ సరసన మొద‌టి సారి న‌టించే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. దర్శకుడు కిశోర్ తిరుమల రూపొందించనున్న `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాలో శర్వానంద్ హీరోగా న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. జనవరి నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు.

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టిన ర‌ష్మిక..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts