రష్మిక మందన్న కొంటెతనం.. స్నేహితులకు సర్ప్రైజ్..?

October 20, 2020 at 5:27 pm

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిరాక్ పార్టీ అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అందాల ఆరబోత చేయకుండా తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రష్మిక మందన వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అంతేకాదు వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటు ప్రస్తుతం హై స్పీడ్ తో దూసుకుపోతుంది రష్మిక మందన.

అయితే రష్మిక మందన్న కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎంతోకొంటే పనులు చేస్తూ అభిమానులు అందరినీ అలరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే గోవాలో స్నేహితులతో బీచ్ లో ఎంజాయ్ చేసిన రష్మిక మందన తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తన స్నేహితులు వారి పనిలో వారు నిమగ్నమైన సమయంలో రష్మిక మందన్న వారి ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక రష్మిక మందన ను ఒక్కసారిగా చూసి స్నేహితులు ఎంతగానో సర్ప్రైస్ అయ్యారు.https://www.instagram.com/p/CGh9GQUJXrB/?utm_source=ig_web_copy_link

రష్మిక మందన్న కొంటెతనం.. స్నేహితులకు సర్ప్రైజ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts