సూప‌ర్ రికార్డ్‌.. కోటి మందిని వెనకేసుకున్న ర‌ష్మిక‌?

October 18, 2020 at 10:04 am

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. `గీత గోవిందం` సినిమా సూప‌ర్ హిట్ కొట్టి తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైపోయింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతూ.. స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇటీవ‌ల సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల‌తో మంచి హిట్లు అందుకున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ర‌ష్మిక తాజాగా క్రీజీ రికార్డ్‌ను అందుకుంది. అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్న కోటి మంది ఫాలోవర్స్ సంఖ్యను ర‌ష్మిక కూడా సొంతం చేసుకుంది. తాజాగా ర‌ష్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ 10 మిలియన్ ల మార్క్ క్రాస్ అయింది.

అయితే చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ర‌ష్మిక‌ పది మిలియన్ల ఫాలోవ‌ర్స్‌ను వెనకేసుకోవడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు తో పాటు తమిళం, కన్నడంలో కూడా ర‌ష్మిక‌ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భాష‌ల్లో కూడా ఆమె ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెకు ఈ స్థాయి ఫాలోవర్స్ దక్కార‌ని అంటున్నారు. దీని ప్ర‌కారం.. ర‌ష్మిక హ‌వా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

సూప‌ర్ రికార్డ్‌.. కోటి మందిని వెనకేసుకున్న ర‌ష్మిక‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts