వామ్మో.. శ‌ర్వా సినిమాకు ర‌ష్మిక అంత తీసుకుంటుందా?

October 27, 2020 at 10:56 am

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `పుష్ప‌` చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఈ చిత్రంతో పాటు శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ కూడా ద‌క్కించుకుంది ర‌ష్మిక‌.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్‌, రష్మికతోపాటు ఇతర చిత్ర టీమ్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని సినిమా ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం ర‌ష్మిక బాగానే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. ఇంట‌స్త్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.1.20కోట్లు తీసుకుంటుంద‌ట ర‌ష్మిక‌. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె రెమ్యూనరేషన్‌పై హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

వామ్మో.. శ‌ర్వా సినిమాకు ర‌ష్మిక అంత తీసుకుంటుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts