రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి : జగన్

October 27, 2020 at 2:47 pm

ఇటీవల జగన్ సర్కార్ రైతులందరికీ చేయూత అందించే విధంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇటీవల ఏర్పడిన ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడింది. ఈ క్రమంలోనే పంట నష్టపోయిన రైతులందరికీ అండగా నిలబడేందుకు సిద్ధమైన జగన్మోహన్రెడ్డి సర్కార్… భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కోసం 135.78 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే వరదలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. పంట నష్ట పోయిన తర్వాత రైతులకు ఆ సీజన్ లో నష్టపరిహారం చెల్లించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుల మత ప్రాంతం అనే తేడా చూడకుండా భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రతి అర్హుడుకి కూడా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బ్యాంకులు ప్రభుత్వం చెల్లించే సొమ్మును రుణాల కింద జమా చేసుకునేందుకు వీలు లేకుండా ఆదేశాలు కూడా జారీ చేశామని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి : జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts