రాష్ట్రం అల్లాడిపోతోంది.. కేసిఆర్కు గ్రేటర్ మాత్రమే కనిపిస్తుంది..?

October 24, 2020 at 5:28 pm

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులందరూ ఆందోళనలో మునిగిపోయారు మరోవైపు హైదరాబాద్ నగర పరిస్థితి కూడా అధ్వానంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సహాయం కింద 550 కోట్లు విడుదల చేశారు.

అయితే ఇదే విషయంపై మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పడి రైతులు నష్టపోతే ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం ప్రగతిభవన్ దాటి కాలు బయట పెట్టకపోవటం దారుణం అంటూ వ్యాఖ్యానించారు. అయితే భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ పంట నష్టపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం హైదరాబాద్ వరద బాధితులకు మాత్రమే సహాయం ప్రకటించడం  శోచనీతం అంటూ విమర్శించారు. జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసిఆర్ వరద బాధితులకు నిధులు విడుదల చేశారు అంటూ విమర్శించారు.

రాష్ట్రం అల్లాడిపోతోంది.. కేసిఆర్కు గ్రేటర్ మాత్రమే కనిపిస్తుంది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts