రేవంత్ రెడ్డి అరెస్ట్…టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు…

October 17, 2020 at 1:20 pm

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరు వద్ద కృష్ణా నది ఒడ్డున మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథక మొదటి దశ లిఫ్టు పంపుహౌస్‌ లోపల భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు మోటారు బిగించిన ఫౌండేషన్‌ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడడంతో పంప్‌హౌస్‌ గోడని చీల్చుకొని ఫౌండేషన్‌ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకెళ్లాయి. ఇక ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సర్జిపూల్‌ నుంచి వరదనీరు భారీగా పంప్‌హౌస్‌లోకి చేరింది. కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌస్‌లోని 14 అంతస్తుల్లోని పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోటార్లను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

ఇక దీనిపై రేవంత్ సంచలన ట్వీట్ చేశారు ‘నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక… ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహారతో నిజాన్నెందుకు దాస్తోంది. ఆలోచించు తెలంగాణమా’ అని అన్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్…టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts