వైసీపీ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ.. ఆందోళ‌న‌లో నేత‌లు!

October 13, 2020 at 7:42 am

తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కారుకు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మల్లాం జంక్షన్ దగ్గర సోమ‌వారం రాత్రి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌కి‌ కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌కు తృటి ప్ర‌మాదం త‌ప్పింది.

అయితే డ్రైవ‌ర్‌కు మాత్రం స్వ‌ల్ప గాయాలు అవ్వ‌డంతో.. అత‌డిని వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగంతోనే ప్రమాదం చోటుచేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని.. ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌ను వేరే వాహనంలో ఇంటికి త‌ర‌లించారు.

ఇక వ‌ర‌ప్ర‌సాద్ కారుకు రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో వైసీపీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాగా, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైసీపీ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ.. ఆందోళ‌న‌లో నేత‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts