శ్రీ‌కాంత్ త‌న‌యుడితోనే `పెళ్లి సంద‌డి`.. క్లారిటీ వ‌చ్చేసింది!

October 27, 2020 at 10:07 am

1996లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్‌ హీరోగా వ‌చ్చిన `పెళ్లి సంద‌డి` చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేదు. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ని తీయబోతున్నట్లు దర్శకేంద్రుడు ఇటీవ‌ల ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇక‌ కేవలం సినిమా పేరు మాత్రమే ప్రకటించిన ఆయన అందులో నటించే హీరోహీరోయిన్లు ఎవరనేది మాత్రం చెప్ప‌లేదు. అయితే తాజాగా ఈ చిత్రంలో హీరో ఎవ‌రో రివిల్ చేశారు చిత్ర యూనిట్‌. ముందు నుంచి అనుకున్న‌ట్టుగా హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రోషన్‌ లుక్‌కి సంబంధించిన ఫొటోలతో కూడిన వీడియోని చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

ఈ వీడియోలో రోషన్ లుక్ అద్భుతంగా ఉంది. చాలా డిఫరెంట్‌గా, ఫిట్‌గా క‌నిపిస్తున్నాడు రోషన్‌. మ‌రి ఈ చిత్రంలో రోష‌న్ స‌ర‌స‌న ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారో చూడాలి. కాగా, ఈ సినిమాకు కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

శ్రీ‌కాంత్ త‌న‌యుడితోనే `పెళ్లి సంద‌డి`.. క్లారిటీ వ‌చ్చేసింది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts