ఆ రాష్ట్రంలో రూ.20కే చీర, దోతి..!.

October 18, 2020 at 4:48 pm

జార్ఖండ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు ఓ తీపి కబురు ‌ చెప్పింది. నిరు పేదల కొరకు రాష్ట్రంలో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది అని ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు రూ.10కే ధోతి లేదా లుంగీ, రూ.10కే చీరను అందచేస్తునట్టు తెలిపారు, అంటే రూ.20కే ధోతి, చీర రెండు ప్ర‌భుత్వం ఇవ్వబోనున్నట్టు వెల్ల‌డించింది. అయితే ఈ అవ‌కాశం ఏడాది మొత్తం ఉండ‌ద‌ని, కేవలం ఏడాదికి రెండు సార్లు మాత్రమే రూ.10 ధ‌ర‌తో వ‌స్త్రాలు అందజేస్తామని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ తెలియజేశారు .

తమ రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులు అందరికి ప్రతి ఆరు నెలలకు ఒక‌సారి దుస్తులు అందజేయ‌నున్న‌ట్లు జార్ఖండ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించారు.జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హేమంత్‌ సోరెన్‌ నాయకత్వంలోని జేఎంఎం పార్టీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కు తమ ప్రజలకు ధోతీలు, చీరలు ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.ప్రస్తుతం ఆ మేర‌కే సోరెన్ స‌ర్కారు ఈ సరికొత్త ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. కాగా, ఈ అవకాశాన్ని నిరుపేద ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని జార్ఖండ్ ప్ర‌భుత్వం కోరారు.

ఆ రాష్ట్రంలో రూ.20కే చీర, దోతి..!.
0 votes, 0.00 avg. rating (0% score)