ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. అవి వాడుకోవచ్చు..?

October 30, 2020 at 6:26 pm

కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించు కునేందుకు ఇటీవల కేంద్రప్రభుత్వం అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా కొన్ని బస్సు సర్వీసులను ప్రయాణికులు అందరికీ అందుబాటులో ఉంచింది. ఇక క్రమక్రమంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సు సర్వీసులను పెంచుతూ వస్తుంది తెలంగాణ ఆర్టీసీ. ఇటీవలే ఆర్టీసీ ప్రయాణికులందరూ శుభ వార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.

లాక్ డౌన్ సమయంలో ప్రయాణికులందరూ వినియోగించుకోకుండా ఉన్న బస్సు పాసులను ప్రస్తుతం తిరిగి ఉపయోగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. నవంబర్ 30 లోపు పాత ఐడి కార్డు టికెట్ను కౌంటర్లో ఇచ్చి కొత్త పాస్ తీసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ శుభ వార్త చెప్పింది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. కాగా ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఇచ్చిన అవకాశం అటు ఆర్టీసీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. అవి వాడుకోవచ్చు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts