ఆరోగ్య‌సేతు యాప్‌ను ఎవరు క్రియేట్ చేసారో మీకు తెలుసా..?!

October 28, 2020 at 4:31 pm

క‌రోనా వైర‌స్ కారణంగా దేశంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో జనాలు త‌మ స్మార్ట్ ఫోన్లో ఆరోగ్య‌సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విష‌యం మనకు తెలిసిందే. అయితే ఈ యాప్‌ను ఎవ‌రు డిజైన్ చేసారు అన్న దానిపై ప్ర‌భుత్వం ఇచ్చిన వివరణతో సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్ కోపం వ్య‌క్తం చేసింది. ఈ ఆరోగ్య‌సేతు యాప్‌ను నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు వెబ్‌సైట్‌లో ఉన్నా.. ఆర్టీఐ వేసిన ప్ర‌శ్న‌లకు మాత్రం ఎవ్వరు స‌మాధానం ఇవ్వలేదు. ప్ర‌భుత్వ విభాగాలు ఇచ్చిన సమాధానాలు త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్న‌ట్లు సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్ త‌న నోటీసుల్లో పేర్కొన్న‌ది. అధికారులు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డాన్ని అంగీక‌రించ‌లేమ‌ని ఆర్టీఐ త‌న నోటీసులో పేర్కొన్న‌ది. యాప్‌ను ఎవ‌రు క్రియేట్ చేశారు, వాటి ఫైల్స్ ఎక్క‌డ ఉన్నాయి లాంటి అంశాల‌పై చీఫ్ ప‌బ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్లు వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోయిన‌ట్లు సీఐసీ చెప్పింది.

న‌వంబ‌ర్ 24వ తేదీన క‌మిష‌న్ ముందు హాజ‌రు కావాలంటూ ఆయా శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు. యాప్‌కి సంబందించిన వివ‌రాలు వెల్ల‌డించేందుకు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు కార్య‌క‌ర్త సౌర‌వ్ దాస్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. యాప్ త‌యారీకి సంబంధించిన‌ ఫైళ్లు మొత్తం వాళ్ళ ద‌గ్గ‌ర లేవ‌ని నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మాటిక్స్ సెంట‌ర్ పేర్కొన్న‌ది.

ఆరోగ్య‌సేతు యాప్‌ను ఎవరు క్రియేట్ చేసారో మీకు తెలుసా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts