త్వర‌లోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

October 27, 2020 at 8:46 am

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్క‌రి త‌ర్వాత ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్న వేళ‌.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నాడ‌న్న వార్త‌లు నెట్టింట్లో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. ఆంధ్రాకి చెందిన ఓ అమ్మాయిని సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు.. మెగా స్టార్ చిరంజీవినే ద‌గ్గ‌రుండి పెళ్లి ప‌నులు చూసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించిన సాయి ధ‌ర‌మ్ తేజ్ పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేద‌న్న సాయి తేజ్‌.. తన కంటే, తన కుటుంబం కంటే మీడియాకే తన పెళ్లిపై ఎక్కువ ఆసక్తి ఉందంటూ సెటైర్లు కూడా పేల్చాడారు. ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేసేయాలని నిర్ణయానికి వచ్చేశార‌ని.. వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక సంబంధాలు చూడమని చెప్పా.

అంతకుమించి పెళ్లిపై నాకెలాంటి ఇంట్రస్ట్ లేద‌ని సాయి తేజ్ తెలిపారు. ఒక‌వేళ‌అమ్మాయి బాగుంద‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే అప్పుడు ఆలోచిస్తానంటున్నాడు సాయి తేజ్‌. కాగా, ప్ర‌స్తుతం సాయి తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం సోలో బతుకే సో బెటర్. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న్స్‌లో ప‌డ్డారు చిత్ర యూనిట్‌.

త్వర‌లోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts