నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఆ ఇద్ద‌రు భామలు ఫిక్స్‌!

October 25, 2020 at 2:28 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Breakout star Sai Pallavi speaks about her Telugu debut 'Fidaa'

ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. నానికి ఇది 27వ చిత్రం. అయితే నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా మలార్ బ్యూటీ సాయి పల్లవి, ఉప్పెన ఫేమ్‌ కృతి శెట్టి ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Uppena' fame Krithi Shetty to romance Vishwak Sen in 'Paagal'? | Telugu Movie News - Times of India

ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా మూవీ యూనిట్‌ విడుదల చేసింది. అందులో నాని మీసకట్టుతో ఉండగా.. దుర్గమాత, హౌరా బ్రిడ్జి కూడా కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు.

 

నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఆ ఇద్ద‌రు భామలు ఫిక్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts