ప‌వ‌న్‌తో జ‌త క‌ట్ట‌నున్న ఫిదా బ్యూటీ.. బొమ్మ అదిరిపోద్ది?‌

October 29, 2020 at 10:03 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. వీటితో పాటు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ కూడా ప‌వ‌న్ చేయ‌నున్నారు.

దీనిపై ఇటీవ‌ల అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమెను మేక‌ర్స్ సంప్రందించార‌ట‌. ఇక నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్ క‌ళ్యాన్-సాయి ప‌ల్ల‌వి కాంబినేష‌న్ అదిరిపోతుంద‌ని చెప్పాలి. కాగా, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ పాత్రలో రానా, బిజు మీనన్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది.

ప‌వ‌న్‌తో జ‌త క‌ట్ట‌నున్న ఫిదా బ్యూటీ.. బొమ్మ అదిరిపోద్ది?‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts