ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు.. చెన్నై ఓటమిపై ధోనీ భార్య భావోద్వేగం!

October 26, 2020 at 10:57 am

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజ‌న్‌లో మాత్రం పేలవమైన ప్రదర్శన చేసి.. ప్లేఆఫ్స్‌‌ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరకుండానే.. లీగ్ దశ నుంచే వైదొలుగుతోంది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ జ‌ట్టు అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కొంద‌రైతే ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు కూడా దిగుతున్నారు. అయితే తాజాగా దీనిపై ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశారు. ఇది కేవలం ఆట మాత్రమే.. కొన్ని మ్యాచ్‌ల్లో గెలవొచ్చు.. కొన్నింట్లో ఓడొచ్చ‌ని సాక్షి తెలిపారు. అయితే ఒడిపోవాలని ఎవరూ కోరుకోరని… ఇదే సమయంలో అందరూ విజేతలు కాలేరని అన్నారు.

ఇక క్రికెట్ ను కేవలం ఆట మాదిరిగానే చూడాలని… మన భావోద్వేగాలను క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు వాడకూడదని స్ప‌ష్టం చేశారు. నిజమైన యోధులు యుద్ధం చేయడానికే పుడతారని సాక్షి చెప్పారు. అభిమానుల గుండెల్లో వారు ఎప్పటికీ సూపర్ కింగ్స్ గానే ఉంటారని.. చెన్నై జ‌ట్టుకు త‌న మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌స్తుతం సాక్షి పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు.. చెన్నై ఓటమిపై ధోనీ భార్య భావోద్వేగం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts