షూటింగ్‌లో నాగార్జున‌ బిజీ.. బాగ్‌బాస్ హోస్ట్‌గా కోడ‌లు?

October 22, 2020 at 4:59 pm

బిగ్ బాస్ సీజ‌న్ 4.. ఏదో వారం పూర్తి చేసుకోబోతోంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ ఇంటి నుంచి ఏడుగురు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌నున్నారు. కొత్త కొత్త టాస్కుల‌తో రంజుగా సాగుతున్న ఈ షోకు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వ‌చ్చేలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోకు ఒక చిక్కొచ్చిపడింది.

హోస్టు నాగార్జున కొన్నాళ్ల పాటు ఈ షోకి అందుబాటులో ఉండడం లేదు. ప్ర‌స్తుతం నాగార్జున అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `వైల్డ్ డాగ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ మ‌నాలీలోని సుంద‌రమైన‌ ప్ర‌దేశాల్లో మొద‌లైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నాగార్జున తాజాగా హైదరాబాద్ నుండి పంజాబ్ వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మనాలి వెళ్లారు.

పూర్తిగా మంచుతో కప్పబడిన మనాలి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నారు. షెడ్యూల్‌లో భాగంగా మ‌రో నెల రోజుల పాటు నాగ‌ర్జున అక్క‌డే ఉండ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ షోకి ఈ నెల రోజుల పాటు నాగ్ అందుబాటులో వుండరు కాబట్టి, మరి ఈ గ్యాప్ లో ఎవరు హోస్టుగా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం నాగార్జున కోడ‌లు, చైతూ భార్య స‌మంత అక్కినేని బిగ్ బాస్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంద‌ని టాక్ న‌డుస్తోంది. నాగ్ స‌ల‌హా మేర‌కు స‌మంత రంగంలోకి దిగుతుంద‌ట‌. మ‌రి ఇందులో నిజ‌మెంతుందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

షూటింగ్‌లో నాగార్జున‌ బిజీ.. బాగ్‌బాస్ హోస్ట్‌గా కోడ‌లు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts