లాక్‌డౌన్‌లో స‌మంత ఎంత‌ సంపాదించిందో తెలుసా?

October 26, 2020 at 12:41 pm

స‌మంత అక్కినేని.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో అక్కినేని వార‌బ్బాయి నాగ చౌత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుని.. త‌న ఇమేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఇక పెళ్లి తరువాత కూడా స‌మంత‌ వరుస సినిమాల‌తో దూసుకుపోతూ.. చేతి నిండా సంపాదిస్తోంది.

ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్‌లోనూ స‌మంత బాగానే సంపాదించింది. అయితే డ‌బ్బు కాదండోయ్‌.. అభిమానుల మ‌న‌సుల‌ను. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న స‌మంత‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ల (1.30 కోట్లు)కు పైగా ఫాలోవ‌ర్స్‌ను సంపాదించింది.

దీని ప్ర‌కారం చూస్తే.. సోష‌ల్ మీడియాలో స‌మంత హ‌వా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా, స‌మంత తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4 హోస్ట్‌గా అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ ను తనదైన ముద్దుముద్దు మాటలతో సామ్ రక్తికట్టించింది. ఎవరినీ వదలకుండా, అందరి తప్పొప్పులు చెబుతూ మామకు తగ్గ కోడలినని నిరూపించుకుంది.

లాక్‌డౌన్‌లో స‌మంత ఎంత‌ సంపాదించిందో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts