
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్న సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల స్వయంగా ప్రకటించింది కాజల్. ముంబైలోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అక్టోబర్ 30న కాజల్ వివాహం జరగనుంది.
కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందకు తానుచాలా సంతోషంగా ఉందని చెప్పిన కాజల్.. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నందకు మీ సపోర్ట్ కావాలని..తమను ఆశీర్వదించాలని కోరింది. ఇక కాజల్ పెళ్లి వార్త ప్రకటించినప్పటి నుంచి.. ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అక్కినేని వారి కోడలు సమంత మాత్రం కాస్త వెరైటీగా కాబోయే పెళ్లికూతురికి అదిరిపోయే గిఫ్ట్ పంపింది.
ఇటీవల సమంత `సాకి` పేరుతో లేడీస్‌కి చెందిన డిజైనర్ వేర్ షోరూమ్‌ని ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. . ఈ సందర్భంగా టాలీవుడ్ కోలీవుడ్ లోని పలువురు తారలకు ఆమె సాకీ గిఫ్ట్ హంపర్ ను పంపుతోంది. ఇందులో భాగంగా.. కాజల్ కు కూడా ఓ ప్రత్యేక గిఫ్ట్ హంపర్ ను పంపించి ఆశ్చర్యపరిచింది.