
దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ చైర్మన్ లీ కున్-హీ మృతి చెందారు. ఈయన వయసు 78 సంవత్సరాలు. 2014 నుంచి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న లీ.. గుండెకు శస్త్రచికిత్స కూడా చేయించికున్నారు. అయితే ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆ సమయంలో కుటుంబసభ్యులు, వైస్-ఛైర్మన్ జే వై లీ పక్కనే ఉన్నారట. తమ ఛైర్మన్ కున్-హీ-లీ కన్నుమూశారని ప్రకటించడం చాలా విచారకరమని శామ్సంగ్ తన ప్రకటనలో పేర్కొంది. చైర్మన్ లీ నిజమైన దార్శనికుడని, శామ్సాంగ్ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్ టెక్ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చాడని సంస్థ కొనియాడింది.
మరియు ఆయన వారసత్వం శాశ్వతమైనది అని ప్రశంసించింది. కాగా, ప్రపంచంలోని 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియాలో ఆధిపత్యం చలాయించే సంస్థలలో శామ్సంగ్ అతి పెద్దది. కంపెనీ టర్నోవర్ మొత్తం దక్షిణ కొరియా స్థూల జాతీయోత్పత్తిలో ఐదో వంతుకు సమానం.