సంక్రాంతికి ఫిక్సయిన హీరో విజయ్..?

October 5, 2020 at 4:27 pm

కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు అన్ని పనులు పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కొంతమంది ముందుగానే ఓ టి టి లో విడుదల చేయగా మరికొంతమంది మాత్రం సినిమా థియేటర్లు తెరుచుకునేంత వరకు వేచి చూశారు. ఇటీవలే సినిమా థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న కోలీవుడ్ హీరో విజయ్ మాస్టర్ సినిమా విడుదలకు సిద్ధమైన ట్లు తెలుస్తోంది.

ఖైదీ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే సరికి సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట చిత్ర బంధం. ఇక త్వరలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

సంక్రాంతికి ఫిక్సయిన హీరో విజయ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts