సరికొత్త పాత్రలో సుధీర్ బాబు.. శ్రీదేవి సోడా సెంటర్ మోషన్ పోస్టర్ విడుదల.?

October 30, 2020 at 6:04 pm

ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. కేవలం కథ బలంగా ఉన్న సినిమాలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు సుధీర్ బాబు. ఈ క్రమంలోనే వరుసగా మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఒక ఇటీవలే నానితో జతకట్టి మల్టీస్టారర్ సినిమా వి మూవీ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు సుధీర్‌బాబు.

ఇక ఇప్పుడు సుధీర్‌బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే టైటిల్ తోనే తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకర్షించిన సుధీర్ బాబు ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్రకు సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ తో సుధీర్‌బాబు పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంది. భుజాన డెకరేషన్ లైట్ వేసుకొని… సోడా తాగుతూ సైకిల్ పై కూర్చున్న ఒక ఫోటో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.https://youtu.be/j1pwVp7jzFo

సరికొత్త పాత్రలో సుధీర్ బాబు.. శ్రీదేవి సోడా సెంటర్ మోషన్ పోస్టర్ విడుదల.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts