ఎస్బిఐ ఆన్లైన్ సర్వీసెస్ బంద్.. స్పందించిన బ్యాంక్..!

October 13, 2020 at 4:02 pm

ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్టేట్ బ్యాంకు కస్టమర్లందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు సరిగా పనిచేయకపోవడంతో.. ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహించలేక పోయారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు . ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగడం పై ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ వివరణ ఇచ్చింది.

ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడి ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ కాకపోవడంపై స్పందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు అందరికీ క్షమాపణ చెప్పింది. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో కనెక్టివిటీ సమస్య ఏర్పడడం కారణంగానే ఇలా ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఏటీఎం పాయింట్ ఆఫ్ సేల్ మినహా మిగతా అన్ని ఛానల్లు ఆగి పోయాయి అంటూ తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అంతరాయానికి చింతిస్తున్నాము త్వరలోనే ఈ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఖాతాదారులు అండగా నిలవాలని కోరింది.

ఎస్బిఐ ఆన్లైన్ సర్వీసెస్ బంద్.. స్పందించిన బ్యాంక్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts