ఏపీ లో నవంబర్ 2 నుండి స్కూల్స్ ప్రారంభం.. !! కానీ ఆ నియమాలు తప్పనిసరి.. !!

October 29, 2020 at 5:24 pm

కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు సైతం ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సమయం దగ్గర నుండి విద్యాసంస్థలు మూతబడినవి. అయితే ఇప్పుడు తాజాగా నవంబర్ 2 నుండి మూతపడిన స్కూళ్లు, కాలేజీలో తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను కింద విధంగా ఉంది.

నవంబర్ 2 నుంచి 910 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు హాఫ్ డే మాత్రమే నడపాలని నిర్ణయం తీసుకున్నారు.  హయ్యర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.అంటే నవంబర్ 23 నుంచి 678 తరగతులకు క్లాసులు ప్రారంభం అవ్వనున్నాయి. ఇక డిసెంబర్ 14 నుంచి 12345 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు హాఫ్ డే మాత్రమే  క్లాసులు నిర్వహిస్తారు. అయితే పైన తెలిపిన విధంగా మాత్రమే అన్ని  ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు పాటించాలని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే కరోనా వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఏపీ లో నవంబర్ 2 నుండి స్కూల్స్ ప్రారంభం.. !! కానీ ఆ నియమాలు తప్పనిసరి.. !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts