ప‌చ్చ‌ని సంసారంలో మాజీప్రియుడి చిచ్చు

October 18, 2020 at 12:28 pm

ప్రేమ‌లో ఉన్నాం క‌దా హ‌ద్దులు దాట‌వ‌ద్దు. ఇష్టారాజ్యంగా తిరుగుతూ.. ఫొటోలు దిగ‌వ‌ద్దు. ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో తెలియ‌దు. పెళ్లికి ముందు చేసిన ఆ ప‌నులు వివాహ జీవితంలో క‌ల్లోలం సృష్టించ‌వ‌చ్చు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. కాలేజీ చ‌ద‌విరోజుల్లో ఓ యువ‌తి త‌న స్నేహితుడిపై ప్రేమ‌ను పెంచుకుంది. అత‌నితో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగింది. శృంగార‌లో కూడా హ‌ద్దులు దాటింది. అయితే వాట‌న్నింటినీ ఫొటోలు, వీడియోలు తీసిన ఆ ప్రేమికుడు ఆ త‌రువాత ఆ యువ‌తిని బెదిరించ‌డం మొద‌లు పెట్టాడు. ఆ వేధింపులను తాళ‌లేక ఆమె ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. గ‌మ‌నించిన కుటుంబ స‌బ్యులు ఆమెను ర‌క్షించి, ఆరా తీయ‌గా అస‌లు విష‌యం చెప్పింది. దీంతో వారు పోలీసుల‌ను స‌మాచారం ఇచ్చారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ కు చెందిన ఓ యువ‌తి మూడేళ్ల క్రితం తన కాలేజీ క్లాస్ మేట్ ప్రణవ్ ను ప్రేమించింది. ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీర‌కంగానూ లొంగ‌దీసుకున్నాడు. ఇదిలా ఉండ‌గా.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించ‌డంతో విషయాన్ని ప్రియుడికి చెప్పింది. అంతే అప్ప‌టి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని బిచాణా ఎత్తేశాడు ప్రణవ్. ఆ మోసాన్ని గ్రహించిన యువ‌తి లోలోప‌లే మ‌ద‌న‌ప‌డుతూ తల్లిదండ్రులు చూపిన సమీప బంధువు రాకేష్ ను వివాహం చేసుకుంది. ఏడాది పాటు అంతాసజావుగానే సాగింది ఆ యువ‌తి సంసారం. సరిగ్గా అదే స‌మ‌యంలో మూడు నెలల క్రితం యువ‌తి ఫోన్ కు ఓ వాట్సప్ వీడియో మెసేజ్ వచ్చింది. అది ఓపెన్ చూస్తూనే షాక్‌కు గురైంది. అందులో తన మాజీ ప్రియుడు ప్రణవ్ తో కలిసి తాను సెక్స్ చేస్తున్న దృశ్యాల‌ను చూసి వ‌ణికిపోయింది. ఆ వీడియో తన భర్త కంట పడితే ఇక తన జీవితం నాశనం అయిన‌ట్టే అని ఆందోల‌న‌కు గుర‌యింది. ఇంతలో ప్రణవ్ స్వయంగా ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని లేకుంటే.. ఆ వీడియోను ఆమె భర్తకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేయ‌డంతో మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌యింది. ఆ కామాంధుడి కోరిక‌ల‌ను తీర్చ‌డం మొద‌లుపెట్టాడు. రానురాను ఈ వేధింపులు మ‌రింత తీవ్ర కావ‌డంతో వాటిని భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. సూసైడ్ లెటర్ లో అన్ని విష‌యాల‌ను పూసగుచ్చినట్లు వివరించింది. యువ‌తిని ర‌క్షించిన కుటుంబీకులు , అనంత‌రం ప్రణవ్ పైపోలీసులుకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులో తీసుకున్నారు.

ప‌చ్చ‌ని సంసారంలో మాజీప్రియుడి చిచ్చు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts