శరీరంలో యాంటీ బాడీలు.. అధ్యయనంలో ఆసక్తికర నిజాలు..?

October 24, 2020 at 4:48 pm

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ మహమ్మారి కరోనా వైరస్ కు సంబంధించి సరికొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు వినూత్న మైన పరిశోధనలు జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి కి సంబంధించి… దాని ప్రభావానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనిషి శరీరంలోని ఆంటీ బాడీ ల గురించి అధ్యయనం జరగ్గా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మనిషి శరీరంలో యాంటీబాడీలు ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడే వైరస్ నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

అయితే ఒక మనిషి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం శరీరంలో యాక్టివ్ గా ఉంటాయి అనే విషయంపై ఇటీవలే పరిశోధకులు అధ్యయనం జరిపారు. వీరి అధ్యయనంలో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో అభివృద్ధి జరిగినా యాంటీబాడీలు దాదాపుగా ఏడు నెలలపాటు యాక్టివ్ గా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. పోర్చుగల్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మాలిక్యులర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. 90 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న బాధితుల్లో ఏడు నెలల వరకు యాంటీబాడీలు యాక్టివ్గా ఉంటాయని అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.

శరీరంలో యాంటీ బాడీలు.. అధ్యయనంలో ఆసక్తికర నిజాలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts