ఆ యంగ్ హీరోతో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్న ర‌ష్మిక‌!

October 25, 2020 at 9:09 am

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక ఇటీవల స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు అందుకుంది. ఇక ప్ర‌స్తుతం ర‌ష్మిక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌తో క‌లిసి తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకుంది ర‌ష్మిక‌. వీఐపీ దర్శనం సమయంలో వీరిద్ద‌రూ క‌లిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, శ‌ర్వానంద్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఒక‌టి. నేను శైల‌జ ఫేం కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ‌ర్వా స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌బోతున్నారు. ఇవేళ ద‌స‌రా సంద‌ర్భంగా.. తిరుపతిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకోస‌మే శ‌ర్వా, ర‌ష్మిక తిరుప‌తి వెళ్లారు.

ఆ యంగ్ హీరోతో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్న ర‌ష్మిక‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts