శేఖర్ మాస్టర్ బావోద్వేగం.. అందరికీ సారీ..?

October 29, 2020 at 4:17 pm

డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. శేఖర్ మాస్టర్ డాన్స్ కి ఎంతో మంది వీరాభిమానులు కూడా ఉన్నారు. డాన్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా జడ్జిగా ఆయన వ్యవహరించిన తీరు ఆయనకు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. అయితే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి లు ఇచ్చే కామెంట్లను సాంగ్ గా మలిచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు కంటెస్టెంట్స్.

ఇటీవల శేఖర్ మాస్టర్ కామెంట్లు అన్నింటినీ కలిపి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక ఆ తర్వాత మాట్లాడిన శేఖర్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్టేజీపై ఒంటరిగా తన పోరాటం మొదలైందని ఇక ఇప్పుడు తనతో ఎంతో మంది ఉన్నారని.. ఈ స్టేజి ఎంతోమంది కొరియోగ్రాఫర్ లకు లైఫ్ ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. తాను ఏం చెప్పినా మీ మంచి కోసమే అని… నా జడ్జిమెంట్ వల్ల మీరు ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ చెప్పారు శేఖర్ మాస్టర్. ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళని ప్రశంసిస్తాను అంటూ తెలిపాడు.

శేఖర్ మాస్టర్ బావోద్వేగం.. అందరికీ సారీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts