షేర్ చాట్ లో స్కిట్.. హత్యకు దారి తీసింది..?

October 26, 2020 at 6:25 pm

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా మంచి పనులకోసం ఉపయోగపడడం ఏమో కానీ ఎంతో మంది ప్రాణాలు పోవడానికి దారి తీస్తుంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోయినా లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. షేర్చాట్ ఏకంగా ఒక బాలుడు ప్రాణం మీదికి తెచ్చింది.

శామీర్ పేట లో ఉండే బీహార్ వాసి ఐదేళ్ల బాలుడిని హత్య చేశాడు. బీహార్ వాసి సుదర్శన శర్మ షేర్ చాట్ లో స్కిట్స్ చేయించేందుకు అభియాన్ అనే అయిదేళ్ల బాలుడిని తన వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే జంపింగ్ స్కిట్ చేయించాడు. స్కిట్ చేసిన సమయంలో ఐదేళ్ల బాలుడు కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తనపై ఎక్కడ దాడి చేస్తారో అని భయపడిన సుదర్శన్ శర్మ గదిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

షేర్ చాట్ లో స్కిట్.. హత్యకు దారి తీసింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts