ఆందోళ‌న‌క‌రంగా మారిన హీరో రాజశేఖర్ ఆరోగ్యం.. !

October 22, 2020 at 9:41 am

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఇక క‌రోనా వ‌చ్చి ప‌ది నెల‌లు గ‌డుస్తున్నా.. వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. మ‌రోవైపు సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా దాడి చేస్తోంది.

ఇటీవ‌ల హీరో రాజశేఖర్‌, ఆయన కుటుంబం కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు వాళ్ల ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ తన ట్వీట్టర్‌లో వెల్లడించాడు. అయితే మిగిలిన వారు త్వరగానే కోలుకున్నప్పటికీ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉందట.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయన కుమార్తె మరియు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. `నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్ధనలు ఆయన్ను కాపాడుతాయని న‌మ్ముతున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి.` అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసింది.

ఆందోళ‌న‌క‌రంగా మారిన హీరో రాజశేఖర్ ఆరోగ్యం.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts