బిగ్‌బాస్‌లోకి మ‌రో తెలంగాణ పోరి.. ఇక ర‌చ్చ ర‌చ్చే?

October 24, 2020 at 9:06 am

బిగ్ బాస్ సీజ‌న్ 4.. త్వ‌ర‌లోనే ఏడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ళ్యాణి, దేవి నాగవ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, కుమార్ సాయి ఎలినేట్ అయ్యారు. ఇక ఈ వారం అరియానా, అవినాష్‌, దివి, మోనాల్‌, నోయ‌ల్ మ‌రియు అభిజిత్‌ల‌లో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌నున్నారు.

ఇక వాస్త‌వానికి షో ప్రారంభంలో అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాబట్టుకోలేక‌పోయినా.. వైల్డ్ కార్డ్ ద్వారా కుమార్ సాయి, అవినాస్‌, స్వాతి దీక్షిత్ ఎంట్రీతో షో కాస్త ఆస‌క్తిక‌రంగా, రంజుగా మారింది. షో ఆరంభంలో ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్లు అందరూ ఒకటై.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లనే హౌస్‌మేట్స్ టార్గెట్ చేస్తుండ‌డం, దాని వ‌ల్ల వ‌చ్చే గొడ‌వ‌లు బిగ్ బాస్ ఇంటిని హీటెక్కించాయి.

ఇదిలా ఉంటే.. తాజా స‌మాచారం ప్ర‌కారం మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం కారణంగా హౌస్‌ నుంచి వెళ్లిపోయిన గంగవ్వ స్థానంలో తెలంగాణ పోరి, ప్రముఖ సింగర్ మంగ్లీని తీసుకురాబోతున్న టాక్ న‌డుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని స‌మాచారం. ఇప్ప‌టికే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న షోలోకి మంగ్లీ వ‌స్తే మ‌రింత ర‌చ్చ ర‌చ్చ‌గా సాగుతుంద‌ని అంటున్నారు.

South Singer & Actress Mangli To Make Her Marathi Debut With 'Aamdaar  Niwas' - Bollyy | DailyHunt

బిగ్‌బాస్‌లోకి మ‌రో తెలంగాణ పోరి.. ఇక ర‌చ్చ ర‌చ్చే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts