ఒక్క వెబ్ సిరీస్ కోసం ఇంత మంది దర్శకుల…!?

October 28, 2020 at 6:17 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లో ఒకరు మణిరత్నం. ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం ” పొన్నియన్ సెల్వన్ ” అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ తారాగణంతో రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కంటే ముందు ఒక వెబ్ సిరీస్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ వెబ్ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్ లు ఉండబోతున్నాయిట. ఇక ఈ 9 ఎపిసోడ్ ను కూడా తొమ్మిది మంది ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

ఆ డైరెక్టర్లు అందరూ కూడా మణిరత్నం పర్యవేక్షణలో కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, పొన్ రామ్, హలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామిలు దర్శకత్వం పోతున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 20 మంది స్టార్ నటి నటీమణులు నటించబోతున్నారు. సూర్య, విజయ్ సేతుపతి తో సహా ప్రముఖులు కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ కు ” నవరస ” అనే టైటిల్ లో ఫిక్స్ చేశారు. 9 ఎపిసోడ్ వెబ్ సిరీస్ ఒక్కో రసంతో కథ ఉంటుందట. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ కు 8 మంది సంగీత దర్శకులు 9 మంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లు ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ సంస్థఅయిన  నెట్ ఫ్లిక్స్ ను భారీ మొత్తంలో చెల్లించి కొనుగోలు సమాచారం.

ఒక్క వెబ్ సిరీస్ కోసం ఇంత మంది దర్శకుల…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts