షాకింగ్: 3 రాజధానులకు మద్ధతుగా అమరావతిలో ఏం జరుగుతుందంటే?

October 22, 2020 at 3:17 pm

జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక అమరావతి రైతులు 300 రోజుల పైనుంచి దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఇదే అమరావతి రైతులకు షాక్ కలిగించే అంశమైతే, వారికి మరింత షాక్ కొట్టేలాగా అమరావతిలో కొందరు మూడు రాజధానులకు మద్ధతుగా దీక్షలు చేస్తున్నారు.

మూడు రాజధానులకు మద్దతుగా అమరావతి రాజధాని తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ దీక్షల్లో పలువురు మహిళలు, దళిత, ప్రజా సంఘాల వారు పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొండపల్లి గిరిజ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతోంది కేవలం తన బినామీలకు అడ్డాగా మార్చుకునేందుకేనని మండిపడ్డారు.

షాకింగ్: 3 రాజధానులకు మద్ధతుగా అమరావతిలో ఏం జరుగుతుందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts