సొంత పార్టీ ఎమ్మెల్యే కు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు..?

October 19, 2020 at 2:03 pm

ఇటీవలే బిజెపి ఎమ్మెల్యే అనుచరుడు పోలీసుల ఎదుట కాల్పులు జరపడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతవారం ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో బిజెపి ఎమ్మెల్యే సురేందర్ సింగ్ అనుచరుడు పోలీసుల ఎదుట ఒక వ్యక్తి పై కాల్పులు జరిపిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఏకంగా ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా సురేంద్ర సింగ్ తన అనుచరుడు కి మద్దతు పలకడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది.

ఇక దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిజెపి ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలియా సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జేపీ నడ్డా. అయితే ఈ ఘటనలో కేసు విచారణకు దూరంగా ఉండాలని బిజెపి ఎమ్మెల్యే కు సూచించాలి అంటూ జేపీ నడ్డా ఆదేశించినట్లు యూపీ బీజేపీ ప్రకటించింది.

సొంత పార్టీ ఎమ్మెల్యే కు వార్నింగ్ ఇచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts