దసరా ఉత్సవాలలో సోనూసూద్ విగ్రహం..!?

October 23, 2020 at 4:31 pm

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాలని అస్తవ్యస్తం చేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోగా వారిలో చాలా మంది సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఉద్యోగం పోయిన కొంతమందికి తిరిగి ఉద్యోగాలు వ‌చ్చేలా చేసాడు. విదేశాల‌లో ఉన్న కొంతమందిని వారి ఇళ్ళ‌కు చేర్చ‌డం కోసం అనేక ఏర్పాట్లు చేసి ప్రజల్లో గుండెల్లో హీరోగా నిలిచారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో పలు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ ప్ర‌జ‌ల దృష్టిలో రియ‌ల్ హీరోగా నిలిచి, కొల‌వ‌బ‌డుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో కొందరు భక్తులు ఆయన‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీనిపై సోనూ సూద్‌ స్పందించి తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదేనని అన్నాడు.

దసరా ఉత్సవాలలో సోనూసూద్ విగ్రహం..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts