రాజ‌మౌళి ప్రేమ‌క‌హ‌నీ తెలుసా..?

October 11, 2020 at 8:21 am

దర్శకధీరుడు రాజమౌళి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు సినిమా ఖ్యాతిని యావ‌త్ ప్ర‌పంచానికి చాటారు. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈగ’ చిత్రానికి ముందు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఆయ‌న ఆ మూవీ త‌రువాత ఇతర భాషల్లో కూడా పాపులరిటీని సంపాదించారు. ఇక ‘బాహుబలి’ (సిరీస్) తో అది ఆకాశామంత ఎత్తుకు ఎదిగారు. అపజయమెరుగని దర్శకుడు రాజమౌళి’ అని ఇండియా మొత్తం తెలుసుకుంది. అయితే ఇతని విజయ రహస్యం ఏంటని.. రాజమౌళినే అడిగిన ప్ర‌తిసారీ ఆయ‌న ఇచ్చే స‌మాధానం ఒక్క‌టే. అది నా కుటుంబమే అని. అందులో ఎంతో నిజముంది. అని కూడా చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా రాజమౌళి భార్య రమ డిజైన్ చేసే కాస్ట్యూమ్స్.. ఆయన సినిమాల్లో హైలెట్ గా నిలుస్తుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాజమౌళి,రమలను… ఇండస్ట్రీలో అందరూ ఆదర్శ దంపతులు అంటుంటారు. వారిది ప్రేమ వివాహమే. అయితే చాలా మంది వారి ప్రేమ సంగ‌తి తెలియ‌దు. వాళ్లు ఎలా క‌లుసుకున్నారు? ప్రేమ ఎప్పుడు ప‌డ్డారు.. పెళ్లి ఎలా చేసుకున్నారు, అసలు వీళ్ళను ఆదర్శ దంపతులు అని ఎందుకు అంటుంటారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. నిజానికి రాజమౌళిని పెళ్ళి చేసుకోవడానికి ముందే రమ కు వేరే వ్యక్తితో పెళ్ళైంది. కార్తికేయ‌ రమ మొదటి భర్త కొడుకు. అయితే రమ తన మొదటి భర్తతో.. అభిప్రాయ భేదాల వల్ల విడిపోయింది. అయితే తరువాత రాజమౌళి పరిచయం అవ్వడం.. వారి మధ్య ప్రేమ చిగురించడం జరిగింది. కీరవాణికి రాజమౌళి.. తమ్ముడు వరుస. ఇక కీరవాణి భార్య వల్లి.. స్వయానా రమకు చెల్లెలు కావడం విశేషం. ఇక ‘శాంతినివాసం’ సీరియల్ టైం నుంచీ రాజమౌళి, రమ లకు పరిచయం ఏర్పడిందట. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా టైములో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అంతే సింపుల్గా ఏ హడావిడి లేకుండా పెళ్ళి చేసుకున్నారు. రమకు సంతానం ఉంది. కానీ రాజమౌళి పిల్లల కోసం కోరుకోలేదట. ఓ పాపను దత్తత తీసుకున్నాడు. ఆమెనే మయూఖ. కార్తికేయను కూడా రాజమౌళి సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాడట. నిజంగానే రాజమౌళి,రమ లది ఎంతో ఆదర్శమైన కుటుంబం అని ఒప్పుకోవాల్సిందే.

రాజ‌మౌళి ప్రేమ‌క‌హ‌నీ తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts